ఇంట్లోంచి బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రం నాబరంగాపూర్ జిల్లాకు చెందిన అశ్విన్ అతని భార్య రింకీ తో కలిసి కొంతకాలంగా మండలం లోని బండరావిరాలలో నివాసముంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇంట్లో భర్త లేని సమయంలో రింకీ బయటకు వెళ్లింది. చీకటి పడినా తిరిగి రాకపోవడంతో ఆమె ఆచూకీ కోసం భర్త పోలీసులను ఆశ్రయించాడు.