రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ వ్యాఖ్యాలకు నిరసనగా నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ ఆదిబట్ల మున్సిపాలిటీ అధ్యక్షుడు బాల్ రాజ్ గౌడ్ తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కొంగరకలాన్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, అక్కడ నుంచి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు.