తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. దీంతో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా గత రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. దీంతో పలు చోట్ల పంట నష్టం ఏర్పడింది.