ఫిబ్రవరిలో ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ

69பார்த்தது
ఫిబ్రవరిలో ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ
ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఫ్రాన్స్‌ వేదికగా జరగనున్న ఏఐ సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ వెల్లడించారు. కృత్రిమమేధ వినియోగం, వాటి పర్యవసానాలపై ఈ సదస్సులో చర్చించే అవకాశముంది. "ప్రధాని మోదీ ఫ్రాన్స్‌ పర్యటనకు రానున్నారు. ఇక్కడ నిర్వహించబోయే ‘ఏఐ సదస్సు’ ప్రపంచ శక్తుల మధ్య సంభాషణలకు వేదిక కానుంది. అమెరికా, చైనా, భారత్‌తోపాటు పలు గల్ఫ్‌ దేశాలు ఈ సదస్సుకు హాజరవుతాయి." అని మేక్రాన్‌ తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி