ఉద్యోగులకు భోజనాల ఏర్పాట్లపై జీఎం సమీక్ష
సింగరేణి సంస్థ 2023- 24 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించినందుకు ఈ నెల 11న రామగుండం- 3 ఏరియా వివిధ గనులు, విభాగాలలో సంస్థ ప్రస్తుత స్థితి గతులు, భవిష్యత్తు ప్రణాళికపై నిర్వహించనున్న అవగాహన కార్యక్రమంతోపాటు ఉద్యోగులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు భోజనాల ఏర్పాట్లపై ఏరియా జీఎం సుధాకర్ రావు విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు సంఘాల నాయకులు పాల్గొన్నారు.