యువకుడి కడుపులో ప్రాణాలతో ఉన్న బొద్దింక

81பார்த்தது
యువకుడి కడుపులో ప్రాణాలతో ఉన్న బొద్దింక
ఢిల్లీ వైద్యులు ఎండోస్కోపీ ద్వారా ఓ యువకుడి పేగులో ఉన్న బొద్దింకను తొలగించి మనిషి ప్రాణాలను కాపాడారు. గత కొంతకాలంగా యువకుడు తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండగా పరీక్షించిన ఫోర్టిస్ ఆస్పత్రి వైద్యులు చిన్నపేగుల్లో బొద్దింక ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే అతనికి ఎండోస్కోపి చేసి దానిని తొలగించారు. అన్నం తింటుండగా లేదా నిద్రిస్తున్న సమయంలో నోటి ద్వారా బొద్దింక లోపలికి వెళ్లి ఉంటుందని చెప్పారు.

தொடர்புடைய செய்தி