ఫుడ్ ప్యాకేజింగ్, తయారీలో వాడే ప్రమాదకర కెమికల్స్ మానవ శరీరంలో ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. జర్నల్ ఆఫ్ ఎక్స్‌పోజర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఎపిడెమియాలజీలో ఈ అధ్యయనం ఇటీవల పబ్లిష్ అయింది. 3,600లకు పైగా ఫుడ్ ప్యాకేజింగ్ కెమికల్స్, వాటిలో PFAS, బిస్ఫెనాల్-A వంటి హానికర రసాయనాలు 100 వరకు మనుషుల శరీరంలో ఉన్నాయని వారు పేర్కొన్నారు. ప్యాకేజ్డ్ ఆహారం వేడి చేసి తినొద్దని వారు సూచిస్తున్నారు.