తెలంగాణలో మరోసారి క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. సిరిసిల్లలోని కుసుమ రామయ్య పరిషత్ ఉన్నత పాఠశాలలో మేక పిల్లను బలివ్వడానికి సిబ్బంది యత్నించింది. రికార్డ్ అసిస్టెంట్ వెంకటేశం శుక్రవారం వేకువ జామున 5 గంటలకే స్కూల్ గేటు తాళం తీశారు. ఇది గమనించిన స్థానికులు డీఈఓకి సమాచారం అందించారు. దీంతో స్కూలుకు చేరుకున్న ఎంఈఓ రఘుపతి, విచారణ జరుపుతున్నారు. కాగా ఈ ఘటనపై పూర్తిసమాచారం తెలియాల్సి ఉంది.