సిరికొండ మండలంలోని భీంగల్ రూట్లో కుర్దుల్ పేట్ చౌరస్తాలో సోమవారం సిరికొండ ఏఎస్ఐ బాల్ సింగ్ ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని లేనివారికి జరిమాన విధిస్తామని, లైసెన్సు ఇన్సూరెన్స్ పేపర్ అడిగినప్పుడు చూపెట్టాలని, తాగి బండి నడప రాదని, మద్యం తాగి బండి నడిపితే ఫైన్ తో పాటు జైలు శిక్ష ఉంటదని, బండిని నిదానంగా నడపాలని, నిదానమే ప్రధానమన్నారు. ఊరి లోపల అతి వేగంగా పోరాదని అన్నారు. చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వరాదని ఒకవేళ ఇస్తే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామన్నారు.