వినాయక చవితి ఉత్సవాలలో బాలుడు మృతి
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గోప్య తండాకు చెందిన భూక్య సంజీవ్ ఆదివారం రాత్రి వినాయకుడి మండపం వద్ద సౌండ్ సిస్టంను సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందినట్లు స్థానికులు తెలియజేశారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సంజీవ్ కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడన్నారు.