నిజామాబాదులోని గౌతంనగర్ పద్మశాలి సంఘం భవనంలో ఆదివారం గౌతమి వినియోగదారుల సంఘం, అంకం హాస్పిటల్ ఆద్వర్యంలో ఉచిత మహిళా వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ స్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ అంకం భానుప్రియ వైద్య పరీక్షలు నిర్వహించారు. మహిళలకు ఉచితంగా బీపి, షుగర్ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.