బోధన్ పట్టణంలో శ్రీక్షేత్ర కపిలధార్ మన్మథ్ స్వామి పుణ్యక్షేత్రమునకు సంబంధించి 15వ మహా పాదయాత్ర కరపత్ర ఆవిష్కరణను గురువారం ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకటేశ్వర దేశాయ్, జిల్లా న్యాయస్థాన ఇన్ ఛార్జ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్యామ్ రావు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ పాదయాత్ర నవంబర్ 2న ప్రారంభమై కార్తీక పౌర్ణమి వరకు సాగుతుందని వారు తెలిపారు.