చందూర్ లో కురుస్తున్న వర్షం

79பார்த்தது
చండూరు మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం నుండి ఎండగా ఉన్నటువంటి వాతావరణం సాయంత్రానికి ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. రోడ్డున పోయే వాహనదారులు తడవకుండా ఇండ్లకు, సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెట్టారు. కొద్ది సేపు వర్షానికే రోడ్లన్నీ జలమయమాయ్యాయి. రోడ్ల పై ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. వారం రోజులుగా లేని వాన మళ్ళీ మొదలైందని గ్రామస్తులు అంటున్నారు.

தொடர்புடைய செய்தி