ఘనంగా బసవన్నల పండుగ

81பார்த்தது
ఘనంగా బసవన్నల పండుగ
చందూరు మండలం ఘనపూర్ గ్రామంలో సోమవారం పొలాల అమావాస్య పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఈ పండగను గ్రామస్తులు జరుపుకుంటారు. వ్యవసాయ పనుల్లో దైవంగా భావించే బసవన్నలకు శుభ్రంగా స్నానం చేయించి అందంగా రంగులను దిద్ది ముస్తాబు చేస్తారు. శ్రావణమాసం ముగింపు అమావాస్య రోజున ఎడ్ల పొలాల అమావాస్య పండగను ఘనంగా జరుపుకున్నారు.

தொடர்புடைய செய்தி