డిచ్ పల్లి: డాక్టర్ మాధవి సేవలు మరువలేనివి
ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల డిచ్ పల్లి మెడికల్ ఆఫీసర్ డా. మాధవి సేవలు మరువలేనివని జిల్లా ఆయుష్ విభాగం ఇన్చార్జి డా. నారాయానా రావు కొనియాడారు. డాక్టర్ మాధవి పదవి విరమణ సందర్భంగా శనివారం ఆయుర్వేద ఆసుపత్రిలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూడా. మాధవి సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ విభాగం రాష్ట్ర కార్యదర్శి పురుషోత్తమ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.