వైఎస్ఆర్ ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మండుటెండలో 2003 ఏప్రిల్ 9న ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు. మండుటెండలో 1,475 కి.మీ నడిచారు. ఇటు ఉమ్మడి రాష్ట్రంలో, అటు కేంద్రంలోనూ అధికారంలోకి తెచ్చారు. 2004 మే 14న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా ఫైలుపై తొలి సంతకం చేసి రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. 35 లక్షల పంపుసెట్లకు ఉచిత విద్యుత్‌ను అందించారు.