భైంసా పట్టణంలో శారదాదేవి శోభయాత్రను శనివారం ఘనంగా నిర్వహించారు. బ్రాహ్మణ సమాజ్ ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రతిస్థాపించి ఐదు రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐదవ రోజు ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో సంప్రదాయ బద్ధంగా మహిళలు భజనలు చేస్తూ ప్రధాన విడులగుండా శోభయాత్రను నిర్వహించారు. అనంతరం స్థానిక గడ్డేన్న వాగు ప్రాజెక్టులో నిమజ్జనం చేశారు.