ఘనంగా మొహర్రం పండుగ

74பார்த்தது
ఘనంగా మొహర్రం పండుగ
మొహర్రం పండుగ పురస్కరించుకొని కుంటాల మండలంలోని కల్లూర్ గ్రామంలో మంగళవారం పీరీల పండగను ఘనంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాల నడుమ పీరీలను ఊరేగించగా భక్తులు దట్టీలు వేసి, మలిజ ముద్దలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అగ్నిగుండం వద్ద అలాయ్ బలాయ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువకులు, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி