గొర్రెలు, మేకలు, ఇతర పశుసంపదను పెంచే వారికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్‌లో భాగంగా రూ.1 కోటి వరకు లోన్ అందిస్తోంది. ఇందులో రూ. 50 లక్షల వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంది. ఒక యూనిట్‌లో 500 ఆడ గొర్రెలు లేదా మేకలతో పాటు 25 మగవి ఉండాలి. ఈ స్కీమ్ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు స్థానిక పశువైద్యాధికారిని సంప్రదించవచ్చు లేదా అధికారిక వెబ్‌సైట్ https://www.nlm.udyamimitra.in/ సందర్శించవచ్చు.