ఢిల్లీలో ఓ మహిళా జర్నలిస్టుకు సోమవారం రాత్రి చేదు అనుభవం ఎదురైంది. సూర్యాన్షి పాండే అనే జర్నలిస్టు రాత్రి రాత్రి 10:30 గంటల ప్రాంతంలో లజ్‌పత్ నగర్ నుండి సంత్ నగర్‌కు ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ఆ సమయంలో కారులో వచ్చిన ఆకతాయిలు ఆమె పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. తమ వద్దకు రావాలని బిగ్గరగా కేకలు వేశారు. దీనిపై ఆమె సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.