అస్సాంలోని నాగావ్ జిల్లాలో పార్టీ కార్యకర్తల సమావేశానికి వెళ్తుండగా కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుస్సేన్, ఆయన భద్రతా సిబ్బందిపై దుండగులు దాడి చేశారు. నల్లటి వస్త్రాలు కప్పుకున్న వ్యక్తుల బృందం ఎంపీపై క్రికెట్ బ్యాట్‌లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎంపీ రకీబుల్ హుస్సేన్ సురక్షితంగా బయట పడ్డారు. అయితే ఆయన భద్రతా సిబ్బందిలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.