ఖానాపూర్ పట్టణంలోని ప్రైవేట్ ఎలక్ట్రిషన్ల సమస్యలను పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం అన్నారు. మంగళవారం ఖానాపూర్ పట్టణంలో నిర్వహించిన ప్రైవేట్ ఎలక్ట్రిషన్ యూనియన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ ఎలక్ట్రిషన్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ షబ్బీర్ పాషా, యూనియన్ నాయకులు ఉన్నారు.