ఎమ్మెల్యే సహకారంతో నూతన బోర్లు

61பார்த்தது
ఎమ్మెల్యే సహకారంతో నూతన బోర్లు
ఖానాపూర్ పట్టణంలోని 6వ వార్డులో ప్రజలకు త్రాగునీటి సమస్యలు రాకుండా నూతన బోర్లను వేయిస్తున్నామని మున్సిపల్ ఛైర్మన్ రాజురా సత్యం అన్నారు. ఎమ్మెల్యే బొజ్జు మున్సిపాలిటీకి మంజూరు చేసిన నిధులతో సోమవారం ఆవార్డులో నూతన బోరు నిర్మాణానికి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ కావలి సంతోష్, స్థానిక కౌన్సిలర్ అమానుల్లా ఖాన్, పలు అధికారులు, కమిషనర్ మనోహర్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி