తుంగతుర్తి: ముమ్మరంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు
ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారం పిఆర్టియు ఉపాధ్యాయ సంఘం తోనే సాధ్యమవుతుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు టీ జితేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తీగల నరేష్ లు అన్నారు. గురువారం మద్దిరాల మండలం వెలుగు పల్లి హైస్కూల్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కు నమోదు పత్రాలను పంపిణీ చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మద్దిరాల పిఆర్టియు మండల శాఖ అధ్యక్షులు పాటి సుధీర్ రెడ్డి, పోతురాజు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.