డిసెంబర్ నాటికి పేదలకు భూములు: మంత్రి పొంగులేటి
అర్హులైన పేదలకు డిసెంబర్ నాటికి ప్రభుత్వ భూములు పంచుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. నల్గొండ(D) తిరులమగిరి-సాగర్(M) నెల్లికల్ లో భూ సమస్యల పరిష్కారం కోసం ప్రవేశపెట్టిన పైలెట్ ప్రాజెక్టును మంత్రి పరిశీలించారు. పైలెట్ ప్రాజెక్టుగాయాచారం, తిరుమలగిరి మండలాలను ఎంపిక చేశామని, వాటి పరిష్కారంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించారు. రైతన్నకు భూమి విషయంలో భయం లేకుండా చేస్తామన్నారు.