తుంగతుర్తి: కేసీఆర్ 4 నెలల తర్వాత బయటికి వచ్చి కలలు కంటుండు
కేసీఆర్ వ్యాఖ్యలపై టిపిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ స్పందించారు. ఆదివారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ నాలుగు నెలల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి వచ్చేది మన ప్రభుత్వమే అని పగటి కలలు కంటున్నారని అన్నారు. అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసిన తర్వాత బయటకు వచ్చి తానే తెలంగాణను నిర్మించినట్లు మాట్లాడుతుండు అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు, ప్రజలకు మేలు చేస్తుందన్నారు.