విద్యార్థులు సమాజంలో ఎదురవుతున్న సవాళ్లను స్వీకరించి వాటిని పరిష్కరించే మార్గాలను అన్వేషించాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. మంగళవారం యూనివర్సిటీలో నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని దానిని కనుగొనేందుకు పరిశోధనలు చేస్తేనే సత్ఫలితాలు వస్తాయన్నారు.