రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన నల్లగొండ రామగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఆదివారం కళ్యాణ మహోత్సవానికి మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాలతిల గృహం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు, రామాలయానికి మేళ తాళాలతో తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, వంగాల అనిల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య, భక్తులు, ఈఓ జయరామయ్య పాల్గొన్నారు.