శ్రీరామనవమి కళ్యాణ సందర్భంగా నల్గొండ పద్మావతి కాలనీలో జరుగు కళ్యాణ మహోత్సవానికి ఆదివారం కాలనీ అధ్యక్షులు నేతి రఘుపతి ఇంటి వద్ద నుండి సీతారాముల ఆంజనేయ స్వామి విగ్రహాలు, తలంబ్రాలు, ప్రత్యేక పూజలు, మహిళల కోలాటాలు, సన్నాయి వాయిద్యాల మధ్య, ఊరేగింపుగా మండపానికి తీసుకొచ్చారు. అనంతరం కళ్యాణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మహిళలు భక్తులు పాల్గొన్నారు.