రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సెప్టెంబర్ 30 లోపు గత వానాకాలం, యాసంగికి సంబంధించిన సిఎంఆర్ డెలివరీని రైస్ మిల్లర్లు పూర్తిచేసి తీరాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి కోరారు. శుక్రవారం ఆయన జిల్లాలోని రైస్ మిల్లర్లతో జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సీఎంఆర్ పై సమావేశం నిర్వహించారు. మిల్లర్లు, ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వం నిర్దేశించిన సీఎంఆర్ లక్ష్యం పూర్తవుతుందని అన్నారు.