చిట్యాల మండలం ఎలికట్టే గ్రామంలో సుందరయ్య నగర్ కాలనీ సమీపంలో ఒక పెద్ద మురుగు నీటి గుంట, కోళ్ల పరం ఉండటం వల్ల గ్రామంలో దోమల బెడద ఎక్కువై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సాయంత్రం అయితే దోమల బెడద తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.