రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో భూములు కోల్పోతున్న చౌటుప్పల్ మండలంలో ఉన్న గ్రామాలలోని భూ నిర్వాసితులు తమ సమస్యలు పరిష్కరించాలని మనుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డిని సోమవారం హైదరాబాదులోని తన నివాసంలో కలిసారు. రీజనల్ రింగ్ రోడ్డు కింద భూములు కోల్పోతున్నామని, అక్కడ ఉన్న మార్కెట్ రేటు కంటే ప్రభుత్వం ఇచ్చే పరిహారము చాలా తక్కువగా ఉంటుందని శాసనసభ్యుల దృష్టికి తీసుకొచ్చారు.