నాంపల్లి మండల కేంద్రంలో మార్చి 21 నుంచి జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు నాంపల్లి మండల విద్యాధికారి కె. మల్లికార్జునరావు గురువారం పేర్కొన్నారు. మండలంలో రెండు సెంటర్లలో పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 180 మంది విద్యార్థులు, ఆదర్శ పాఠశాలలో 165 మంది మొత్తం 345 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు.