రాష్ట్రంలో సమగ్ర కులగణన ప్రక్రియ పూర్తి చేసి రిజర్వేషన్లు చేపట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలోని అయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల సందర్భంగా గత ఆరు నెలలుగా కులగణన ఉద్యమం చేపట్టి, బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.