చౌటుప్పల్ మండలం గుండ్లబావి గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డి భావి గ్రామంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో 10 లక్షల హెచ్ఎండిఏ నిధులతో గౌడ సంఘ భవనానికి మాజీ జెడ్పిటిసి చిలుకూరు ప్రభాకర్ రెడ్డి మండల ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో చౌటుప్పల్ మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు.