రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కిమ్యా నాయక్ భువనగిరిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నారు. విధులు ముగించుకొని బైక్ పై ఆలేరుకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.