రామన్నపేట లో అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు కై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్న నేపథ్యంలో బుధవారం రామన్నపేట పోలీసులు ముందస్తు చర్యలో భాగంగా చిట్యాల శివారులో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను అరెస్టు చేశారు. పరిశ్రమ ఏర్పాటును ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణ అడ్డుకుంటారన్న సమాచారంతో ఎక్కడిక్కడ బీఆర్ఎస్ నేతలు, పలువురు ప్రజా సంఘాల నేతలను ముందస్తు అరెస్టు చేపట్టారు.