AP: ప్రేమోన్మాది నవీన్ దాడిలో తెనాలి యువతి సహానా బ్రెయిన్ డెడ్ అయ్యి మరణించిన కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు నవీన్ టీడీపీ నేత అని ఒక వైపు వైసీపీ ఆరోపిస్తుంది. తాజాగా నవీన్ తల్లి కుమారి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన కొడుకు వైసీపీ నేత అని, గతంలో కారు నడపడానికి నవీన్‌ను తీసుకెళ్లి వైసీపీ వాళ్లే రౌడీషీటర్‌గా మార్చారని కుమారి మండిపడ్డారు. సహానాకు, నవీన్‌కు పెళ్లి చేయాలనుకున్నామని, ఇంతలోనే ఇలా జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.