TG: పుట్టిన రోజునే.. కుమారుడి కళ్ల ముందే తల్లి ఆత్మహత్య

8472பார்த்தது
TG: పుట్టిన రోజునే.. కుమారుడి కళ్ల ముందే తల్లి ఆత్మహత్య
పుట్టిన రోజునే కుమారుడి కళ్ల ముందే తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్ధిపేట జిల్లాలో జరిగింది. దుబ్బాక(M) గంభీర్​పూర్‌లో ఉంటున్న సాగర్ రెడ్డి, రవళి దంపతులకు మూడేళ్లలోపు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే చిన్నకొడుకు ముందే ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని తల్లి రవళి ఆత్మహత్య చేసుకుంది. కుమారుడు ఏడుస్తుండగా గమనించిన స్థానికులు వచ్చి చూడగా అప్పటికే రవళి చనిపోయింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదైంది.

தொடர்புடைய செய்தி