2047 నాటికి దేశాన్ని అగ్రగామిగా చేసేందుకు ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారని ఏపీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీలోని విశాఖకు వచ్చిన ప్రధానికి లోకేష్ స్వాగతం పలికారు. విశాఖలో నిర్వహించిన బహిరంగ రభలో లోకేష్ మాట్లాడుతూ.. "హర్ ఘర్ తిరంగా.. ఎక్కడ చూసినా నమో నినాదాలే. వెంటిలేటర్‌పై ఉన్న ఏపీకి మోదీ ఆక్సిజన్ ఇచ్చారు. పేదల చిరునవ్వు నమో.. మహిళల ఆశాదీపం నమో. హైదరాబాద్ వెళ్లి చూస్తే CBN విధానం ఏంటో అర్థం అవుతుంది." అని అన్నారు.