TG: సంగారెడ్డి జిల్లా సంజీవరావుపేట్‌లో ఓ బావిలోని కలుషిత నీరు తాగి వాంతులు, విరేచనాలు అయి ఇద్దరు మృతి చెందగా, 50 మంది అస్వస్థతకు గురయ్యారు. కొద్ది రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో గ్రామంలోని బావిలోని నీళ్లు తాగుతున్నామని స్థానికులు తెలిపారు. బాధితులను ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది గ్రామంలో క్యాంప్ ఏర్పాటు చేశారు.