రాజీ మార్గమే రాజమార్గం

82பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ లో శనివారం జూనియర్ సివిల్ జడ్జ్, మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్పర్సన్ అనిత ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. రాజీ మార్గమే రాజ మార్గమన్నారు. రాజీ కాదగిన కేసుల్లో రాజీ చేసుకుంటే విలువైన సమయం వృథా కాకుండా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி