దుబ్బాకలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తుండగా.. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి స్టేజ్ పైకి వెళ్లారు. ఎలాంటి అధికారం లేకున్నా శ్రీనివాస్ రెడ్డి స్టేజి పైకి ఎలా వెళ్లారంటూ బిఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట జరిగింది.