మంచిర్యాల పట్టణాభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ

58பார்த்தது
మంచిర్యాల పట్టణాభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ
మంచిర్యాల పట్టణ అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. పట్టణంలో మార్కెట్ రోడ్ లో ఆయన పర్యటించారు. రోడ్డు స్థలాలను ఆక్రమించుకొని కట్టడాలు చేపట్టిన వారికి మునిసిపల్ అధికారులు ఇంతకుముందే మార్కింగ్ ఇచ్చారని, ఆ ప్రకారంగా ఎవరికి వారు చర్యలు చేపట్టాలని తెలిపారు. త్వరలోనే మార్కెట్ రోడ్డును వెడల్పు చేయడంతో పాటు ఫుట్ పాత్ నిర్మిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி