మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ను రామగుండం కమిషనర్ శ్రీనివాస్ మంగళవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ట్రైనీ ఎస్సై లతో మాట్లాడారు. రికార్డులు, విధుల గురించి అధికారులు, సిబ్బందితో చర్చించారు. నేరాల నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.