ఆలిండియా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షులు, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ శనివారం మంచిర్యాలలో పర్యటించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సాయత్రం 5. 30 గంటలకు జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్ లో జరిగే సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. టీఎన్జీవో సభ్యులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.