ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు

84பார்த்தது
ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు
మంచిర్యాల పట్టణంలో బుధవారం పట్టణ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 138వ మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బస్ స్టేషన్ ఆటో స్టాండ్ అడ్డా వద్ద యూనియన్ నాయకులు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చికాగో అమరవీరులను స్పూర్తితో హక్కుల సాధనకు పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పొట్ట మధుకర్, నాయకులు రాజ్ కుమార్, సుద్దాల రాజు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி