దండేపల్లి మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన మంత్రి శేఖర్ (35) ఇసుక ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. ఇసుకలో కూరుకుపోయిన ట్రాక్టర్ ను మరో ట్రాక్టర్ సాయంతో లాగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో శేఖర్ 2 ట్రాక్టర్లకు మధ్యలో తాడు కడుతుండగా వెనుక నుంచి ట్రాక్టర్ బలంగా ఢీ కొట్టింది. తీవ్ర గాయాల పాలైన శేఖర్ ను లక్షేటిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.