న్యూడెమోక్రసీ కార్యాలయంలో బ్లాక్ డే

161பார்த்தது
న్యూడెమోక్రసీ కార్యాలయంలో బ్లాక్ డే
రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి ఆరు నెలలు పూర్తి అయిన సందర్భంగా బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో రైతుసంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ డేగా పాటిస్తూ నల్ల జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్ )న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి. శ్రీనివాస్ మాట్లాడుతూ, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మికుల పట్ల రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అధికారాన్ని ఉపయోగించుకుని రెండో దఫా నరేంద్రమోడీ ప్రధాని అయిన తర్వాత రైతాంగాన్ని దెబ్బతీసే మూడు వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చి ప్రజల జీవన విధానంపై దెబ్బతినడంతో రైతులు ఆరు నెలల పాటు ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తున్నారు. కార్పొరేట్ శక్తులకు వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలను కారు చౌకగా అమ్మడం కొరకు నరేంద్ర మోడీ చేస్తున్న కుట్రలను దెబ్బకొట్టాలని కార్మికులు కర్షకులు ఈ దేశాన్ని రక్షించుకోవాలని అన్నారు. లేకపోతే ప్రజల బతుకులు భారమై ఆకలి చావులు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపు ఇవ్వడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్ )న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు మల్లన్న, ఐఎఫ్టియూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. బ్రహ్మానందం, జిల్లా నాయకులు మేకల సురేందర్, అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా అధ్యక్షులు ఏ. లాల్ కుమార్, పి.ఓ.డబ్ల్యూ. జిల్లా సహాయ కార్యదర్శి డి. అరుణ, మహేందర్, విజయ్ , రవి , తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி