మందమర్రి మండలంలోని మోడల్ పాఠశాలలో గంటల ప్రాతిపదికన సివిక్స్ సబ్జెక్టు బోధించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సారా తస్లీమ్ సోమవారం తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో ఎంబీఏ పొలిటికల్ సైన్స్, బిఈడి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. అర్హత గలవారు 12వ తేదీ సాయంత్రం నాలుగు గంటల్లోగా పాఠశాల కార్యాలయంలో దరఖాస్తుల సమర్పించాలని సూచించారు.